[t4b-ticker]

బ్రహ్మముహూర్తంలో ‘రామాయణ’ ట్రైలర్ విడుదల

ప్రతిపక్షం, జూలై 29: బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ పార్ట్-1 సినిమా ట్రైలర్ విడుదలకు చిత్రబృందం ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ నెల 30వ తేదీ గురువారం బ్రహ్మముహూర్త సమయంలో ఉదయం 4:15 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ముందుగా ఈ ట్రైలర్‌ను జులై 24న విడుదల చేయాలని భావించినప్పటికీ, అనివార్య కారణాలతో వాయిదా వేసిన విషయం తెలిసిందే.

దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, సాయిపల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ విడుదలతో సినిమా ప్రచారం మరింత ఊపందుకోనుంది.

Spread the love

Related News

Latest News