[t4b-ticker]

తెలంగాణలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ప్రతిపక్షం, జూలై 29: తెలంగాణ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో మొత్తం 7,437 ఉద్యోగాల భర్తీకి నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ మెగా రిక్రూట్‌మెంట్ ద్వారా పోలీస్ శాఖతో పాటు అనుబంధ విభాగాల్లో వేలాది ఖాళీలను భర్తీ చేయనుంది.

అత్యధికంగా పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) పోస్టులు 3,697 ఉండగా, పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్) పోస్టులు 1,052, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) కానిస్టేబుల్ పోస్టులు 1,380 ఉన్నాయి. అదనంగా ఎస్‌ఐ (సివిల్) పోస్టులు 148, SPF ఎస్‌ఐ పోస్టులు 44, ఫైర్ ఫైటర్ పోస్టులు 751 భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఇతర విభాగాలకు చెందిన పలు పోస్టులు కూడా నోటిఫికేషన్‌లో ఉన్నాయి.

ఈ నియామక ప్రక్రియ పోలీస్ శాఖ, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాలకు వర్తిస్తుంది. అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, పరీక్షల షెడ్యూల్, దరఖాస్తు తేదీలు తదితర పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉన్నాయి.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించి, సూచించిన గడువులోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నియామక మండలి సూచించింది.

Spread the love

Related News

Latest News