హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: నాపై నమ్మకం తో మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ అధిష్టానానికి, ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమితాషా, పార్టీ అధ్యక్షులు నడ్డా గారికి మహబూబ్ నగర్ బిజేపి పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోయిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తో ఓడిపోయాను.. ఈసారి తప్పకుండా గెలుస్తానన్న నమ్మకం ఉంది.. ఆనాడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికి.. ప్రజల్లో నాకు ఆదరణ ఉందని స్పష్టంచేశారు. గత ఎన్నికల్లో బీఆరెస్ 7 అసెంబ్లీ స్థానాల్లో అధికారం లో ఉన్నప్పటికీ.. ఆనాడు 3 లక్షలకు పైగా మెజారిటీ తో రెండో స్థానం లో నిలిచాను అని గుర్తు చేశారు. దేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరిసారి ప్రధాని మోదీ మీనియా మొదలైందని.. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే 12 స్థానాలు, పాలమూరు అభివృద్ధి జరగాలంటే నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ సీట్లు గెలవాల్సిందేనని మహబూబ్ నగర్ సీటును గెలిపిద్దాం ప్రధాని మోదీకి కానుకగా ఇద్దామన్నారు. ఇప్పుడు వెయబోయే ఓటు పెద్ద ఓటు ప్రధానిని నిర్ణయించే ఓటు.. ప్రజలు అలోచించి ఓటు వేయాలని తెలిపారు.
మహిళలకు 2500 హామీ ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, రుణ మాఫీ చేయలేదు.. 500 గ్యాస్ సిలిండర్ అంటున్న.. అదీ అమలుకాలేదు అరు గ్యారెంటిలల్లో ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే కాంగ్రెస్ హామీల అమలు పేరుతో యాడ్స్, మీడియా లో ప్రమోషన్ చేసుకుంటోంది ఇచ్చిన హామీలు అమలు చేసి చూపాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని కాంగ్రెస్ పై ఆమె పైరయ్యారు.