[t4b-ticker]

కంగన వ్యాఖ్యలపై CJP విమర్శలు.. ‘బీజేపీలోనూ ఆమెను ఎవరూ పట్టించుకోరు’

ప్రతిపక్షం, జూలై 29: విద్యార్థుల నిరసనలను అసభ్యకరంగా అభివర్ణించిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వ్యాఖ్యలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్ర విమర్శలు చేసింది.

CJP ప్రతినిధి సౌరవ్ మాట్లాడుతూ, కంగనను బీజేపీ నాయకులే పెద్దగా పట్టించుకోవడం లేదని, జెన్ Z యువత కూడా ఆమె వ్యాఖ్యలను పట్టించుకుంటుందని తాను భావించడం లేదన్నారు. గతంలో ఎంపీగా తనకు పెద్దగా పని ఉండదని కంగనా చెప్పిన వీడియోలను ప్రస్తావిస్తూ, అవే ఆమె ప్రజాప్రతినిధిగా ఉన్న నిబద్ధతను తెలియజేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

రాజకీయ నాయకుల కంటే దేశాభివృద్ధిలో జెన్ Z యువత ఎక్కువ సానుకూల పాత్ర పోషిస్తోందని సౌరవ్ పేర్కొన్నారు. కాగా, విద్యార్థుల నిరసనలపై కంగనా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Spread the love

Related News

Latest News