బియ్యం వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా క్రిమినల్ కేసులు తప్పవు.
జగిత్యాల జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి.
ప్రతిపక్షం, జగిత్యాల, (ప్రతినిధి) నవంబర్, 03: అక్రమ నిల్వలు అధిక ధరల విక్రయాలపై నిరంతర తనిఖీలు నిర్వహిస్తామని జగిత్యాల జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి అన్నారు. బియ్యం వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా క్రిమినల్ కేసులు తప్పవని జిల్లా పౌర సరఫరాల అధికారి ఎస్. జితేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల జిల్లా పరిధిలోని రైస్ మిల్లులు, హోల్సేల్, రిటైల్, బియ్యం, వ్యాపారు లు, ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరా ల అధికారి హెచ్చరించారు.మార్కెట్,లో బియ్యం, కృత్రిమ కొరత,సృష్టించడం, అక్రమంగా నిల్వలు ఉంచ డం, అధిక ధరలకు విక్రయిం చడం వంటి చర్యలను అరిక ట్టేందుకు పౌరసరఫరాలశాఖ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా వ్యాపారులు పాటించాల్సిన నిబంధనల ను వెల్లడించారు. మిల్లులు, గోదాములు, దుకాణాల్లో అక్రమంగా బియ్యం నిల్వ చేయరాదని, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయిం చాలని సూచించారు. ఎం. ఆర్.పి, లేబుళ్ల,ను మార్చ డం, బ్రాండెడ్ బ్యాగుల్లో నాసిరకం బియ్యం, నింపి విక్రయించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.అదేవిధంగా బస్తాలపై పేర్కొన్న పరిమాణం ప్రకారం బియ్యం, తూకం ఉండాలని, 26, కిలోల పేరుతో 24, లేదా 25, కిలోల బస్తాలను విక్ర యిస్తే మోసపూరిత కొలతల చట్టం ప్రకారం చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు.
ప్రతి రైస్ మిల్లు, హోల్సేల్, రిటైల్ దుకాణాల ఎదుట రోజువారీ నిల్వ వివరాలు, ప్రభుత్వం నిర్ణయించిన విక్రయ ధరల బోర్డులను స్పష్టంగా ప్రదర్శించాలి.ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ, ఎఫ్.ఎస్. ఎస్. ఏ.ఐ. లైసెన్స్,లతో పాటు రోజువారీ కొనుగోళ్లు, అమ్మకాల వివరాలతో కూడిన స్టాక్ రిజిస్టర్,లను అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లాలోని డిప్యూటీ తహశీల్దార్లు,ఫుడ్ ఇన్స్పెక్టర్ లు నిరంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహిం చాలని ఆదేశించారు. దుకా ణాలు, మిల్లుల వద్ద ధరల బోర్డుల ప్రదర్శనను పరిశీలిం చడంతో పాటు గోదాముల్లో ని నిల్వలను తనిఖీ చేయా లని స్పష్టం చేశారు. తనిఖీ ల్లో అక్రమ నిల్వలు, ధరల ట్యాంపరింగ్, తూకంలో తేడాలు గుర్తించినా,సంబం ధిత రికార్డులు సక్రమంగా లేకపోయినా వ్యాపారులపై నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటా మని జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి హెచ్చరించారు.





























