బంగారిగడ్డలో ఎండిన పంటలను పరిశీలించిన సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి

*ఎల్ నినోతో తీవ్ర కరువు – రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి – సీపీఐ డిమాండ్.

ప్రతిపక్షం చండూరు నవంబర్ 02: ఎల్ నినో ప్రభావం వల్ల తీవ్రమైన కరువు ఏర్పడిన నేపథ్యంలో సీపీఐ ఆధ్వర్యంలో చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో కరువుతో ఎండిన పంటల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొని రైతులతో కలిసి ఎండిపోయిన వరి, పత్తి పంటలను ప్రత్యక్షంగా పరిశీలించారు. పంటలు చేతికి వచ్చే సమయంలోనే ఎండిపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

*నాయకులు మాట్లాడుతూ…
కరువు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు సహాయక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాభావం వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు వెంటనే పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు.అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ కరువును జాతీయ విపత్తుగా గుర్తించి రైతాంగాన్ని ఆదుకోవాలని, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.ఈ పరిశీలన కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు, చండూరు మండల నాయకులు, బంగారిగడ్డ గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related News

Latest News