[t4b-ticker]

ఫార్ములా ఈ-రేసు కేసు.. రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్

ప్రతిపక్షం, హైదరాబాద్, జులై 30: ఫార్ములా ఈ-రేసు వ్యవహారానికి సంబంధించిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుకానున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా కేటీఆర్‌తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

షెడ్యూల్ ప్రకారం కేటీఆర్ ఉదయం 9 గంటలకు నార్సింగిలోని తన నివాసం నుంచి బయలుదేరి, 10:15 గంటలకు నాంపల్లి ఏసీబీ కోర్టుకు చేరుకోనున్నారు. ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో నిధుల వినియోగం, పరిపాలనా అనుమతులు, నిర్ణయ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ కేసు విచారణపై రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. కోర్టు విచారణలో తదుపరి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఉత్కంఠ రేపుతోంది.

Spread the love

Related News

Latest News