ప్రతిపక్షం, నవంబర్ 02: ‘రామాయణ’ సినిమాలోని ‘మంగళ భరితమే’ పాటపై వస్తున్న విమర్శలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌ను తాను పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశారు. ఒక పాటను రూపొందించడం వెనుక ఎంతో కష్టం, సృజనాత్మక ఆలోచన, నెలల తరబడి సాగే శ్రమ ఉంటాయని వివరించారు. పాటలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ముందు సంగీత దర్శకులు, గాయకులు, సాంకేతిక నిపుణులు ఎంతో సమయం వెచ్చిస్తారని పేర్కొన్నారు.
పాటపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక పాటను ఊరగాయతో పోలుస్తూ, దాని రుచిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. మొదట్లో విమర్శలు చేసిన వారే సినిమా చూసిన తర్వాత అదే పాటను ప్రశంసించే అవకాశం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరి అభిరుచులు, అభిప్రాయాలు ఒకేలా ఉండవని, అందరినీ ఒకేసారి సంతృప్తిపరచడం సాధ్యం కాదని తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. “అందరినీ సంతృప్తిపరచాలనుకుంటే ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలి” అంటూ సోషల్ మీడియా ట్రోలింగ్‌పై చమత్కారంగా స్పందించారు. రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.





























