[t4b-ticker]

భీమేశ్వర స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పూజలు

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, జూలై 30: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఆలయంలోకి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎస్పీ మహేష్ బి గితే కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు కురవాలని, పాడి పంటలు పండాలని ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు.

Spread the love

Related News

Latest News