-విదేశాల్లో ఉన్న సాధత్ నజీర్ కు సిద్దిపేట పై ఎంతో ప్రేమ
ఫౌండేషన్ కన్వీనర్ లయిక్ మొయినుద్దీన్
ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 8: సిద్దిపేట ఫౌండేషన్ వ్యవస్థాపకులు సాదత్ నజీర్ సహాయంతో నిరంతరం ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఫౌండేషన్ సిద్దిపేట కన్వీనర్ మహమ్మద్ లయిక్ మొయినుద్దీన్ అన్నారు. రంజాన్ పర్వదినం సందర్బంగా సిద్దిపేట పట్టణంలోని మిలన్ పంక్షన్ హాల్లో 500 మంది నిరుపేద ముస్లింలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట బిడ్డ సాధత్ నజీర్ వేరే దేశాల్లో ఉన్న స్వంత గడ్డకు ఎన్నో సేవలు అందిస్తున్నారని అన్నారు. రంజాన్ తో పాటు దసరా, క్రిస్మస్ పండుగలకు సైతం నిత్యవసర సరుకులను అందిస్తున్నామన్నారు. అలాగే ప్రతినెల నిరుపేదలకు నెలసరి పెన్షన్లు సైతం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పౌండెషన్ ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు అజీమ్, శ్రీనివాస్, రాజాక్, కరీం, రియాజ్, పాషు, అన్ను,అబ్దుల్ రహీమ్, అప్సర్ తదితరులు ఉన్నారు.