Trending Now

రాజ్యసభకు సుధామూర్తి.. నామినేట్‌ చేసిన రాష్ట్రపతి

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్‌ చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ ‘ఎక్స్‌ (ట్విటర్‌)’ వేదికగా వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటం విశేషం. ”సామాజిక సేవ, విద్య సహా పలు అంశాల్లో ఆమె స్ఫూర్తిదాయక ముద్ర వేశారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆమె రాజ్యసభలో ఉండటం నారీశక్తికి నిదర్శనం. తన బాధ్యతను సుధామూర్తి పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తారని ఆశిస్తున్నా” ఆకాంక్షించారు.

Spread the love