Trending Now

రాయ్‌బరేలీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీహెచ్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రాయ్‌బరేలీలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత సీనియర్, మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంత రావు పాల్గొన్నారు. ఇవాళ రాయ్‌బరేలీలోని ఉంచహార్ అసెంబ్లీ లో జరిగిన నూకడ్ సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, వద్రా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం వీహెచ్ కూడా ఈ సమావేశంలో ప్రసంగిస్తూ.. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీకి ప్రజలు తమ ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వం గత 10 ఏండ్ల నుండి సామాన్య ప్రజల కష్టాలను తీర్చడంలో ఘోరంగా విఫలం అయిందని ఆయన విమర్శించారు.

Spread the love

Related News