ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూస్తుందని ప్రశాంత కిశోర్ చేసిన కామెంట్స్ ను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో నాలుగు గంటలు భేటీ అయిన తర్వాత ఎలాంటి లాజికల్ డేటా లేకుండా ప్రశాంత్ కిశోర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కోవిడ్ సమయంలో కోట్లాది మందిని కాపాడాయి అని ట్విట్ చేశారు.