ఎల్‌నినోపై ప్రజలకు అవగాహన కల్పించాలి: భట్టి విక్రమార్క

ప్రతిపక్షం, జూలై 21: ఎల్‌నినో ప్రభావంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. తక్కువ నీటి వనరులతోనూ పంటలు పండించే అవకాశం ఉన్నందున.. అలాంటి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని అన్నారు.

ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, నిపుణులు సూచించిన మార్గాలను ప్రజలు పాటించాలని భట్టి విక్రమార్క సూచించారు. వర్షాభావ పరిస్థితుల ప్రభావం వ్యవసాయ రంగంతో పాటు విద్యుత్ ఉత్పత్తిపైనా పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ముందస్తు ప్రణాళికతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Spread the love

Related News

Latest News