ప్రశ్నపత్రాల లీకేజీపై రేపు దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు.. CJP పిలుపు

ప్రతిపక్షం, జూలై 25: ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలకు నిరసనగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రేపు (ఆదివారం) దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని CJP పిలుపునిచ్చింది.

సంస్థ విడుదల చేసిన ప్రకటనలో విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు ర్యాలీల ఏర్పాట్లలో భాగస్వామ్యం కావాలని కోరింది. సాయంత్రం ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రజలు ఒకేచోట చేరి ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలపై నిరసన వ్యక్తం చేయడంతో పాటు తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేయాలని సూచించింది.

అలాగే, ఢిల్లీలో నిరసనల సందర్భంగా జరిగిన పోలీసు చర్యలను ఖండిస్తూ శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను వ్యక్తం చేస్తూ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు సంఘీభావం తెలపాలని సంస్థ పేర్కొంది.

దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ క్యాండిల్ ర్యాలీల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.

Spread the love

Related News

Latest News