ప్రతిపక్షం, సెప్టెంబర్ 09, ముషీరాబాద్: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు లంచం తీసుకుంటూ ఓ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ముషీరాబాద్‌కు చెందిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాయిరామ్ రెండు కాంట్రాక్ట్ పనులకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు రూ.10,000 లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
లంచం మొత్తాన్ని స్వీకరిస్తుండగా పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సాయిరామ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
లంచం డిమాండ్ చేసినా, స్వీకరించినా తమకు సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచించారు.





























