హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: సార్వత్రిక ఎన్నికల సంబరం. లోక్ సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తోంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ను మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశంలో ఎన్నికల సంబరానికి తెరలేచింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల సంఘం ‘సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్’ విడుదల చేస్తోంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం శనివారం (మార్చి 16) మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తోంది. ఈసారి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి కూడా తొలిసారిగా ఎన్నికల నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ స్థానాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు సైతం షెడ్యూల్ విడుదల కానుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో తెలంగాణలో ఖాళీ అయిన కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్‌తో పాటు ఇటీవల నియమితులైన ఇద్దరు కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు.. మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది..
ముఖ్యమైన తేదీలు..
★ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల. పోలింగ్ తేదీ మే 13.
★ జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.
★ తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల. పోలింగ్ తేదీ మే 13.
★ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న. కౌంటింగ్ తేదీ జూన్ 4.
★ సిక్కిం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న. కౌంటింగ్ తేదీ జూన్ 4..
★ దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
★ పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది.
★ దేశవ్యాప్తంగా కోటి 82 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు.
★ దేశవ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం.
★ ఎన్నికల్లో 55 లక్షల ఈవీఎంలు వినియోగిస్తున్నాం.
★ ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
★ జూన్ 16 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తాం.
★ 85 ఏళ్లు దాటిన వారికి ఓట్ ఫ్రమ్ హోమ్.
★ సీ-విజిల్ యాప్ ద్వారా ఎన్నికలు, పోలింగ్ ద్వారా ఎవరైనా, ఎలాంటి ఫిర్యాదు అయినా చేయవచ్చు.
★ భారత్‌లో ఎన్నికల నిర్వహణ ఒక పెద్ద ప్రక్రియ. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది.
★ ఎన్నికల్లో హెలికాప్టర్లను, ఏనుగులను, ఒంటెలను ఉపయోగిస్తున్నాం. ఎన్నికల సిబ్బంది నీటి ప్రవాహాలను దాటుతారు. ఎడారి మార్గాల్లో ప్రయాణం చేస్తారు.
★ ఏప్రిల్ 1 వరకు ఓటర్ల జాబితాలో తప్పులను సరిచేసుకోవచ్చు.
★ వాలంటీర్లు, ఇతర తాత్కాలిక సిబ్బంది ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలి.
★ టీవీలు, సోషల్ మీడియాలో ప్రకటనలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.
★ ఎన్నికలకు సంబంధించిన ఫేక్ వార్తలపై అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశాం. ఫేక్ వార్తలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్, వాస్తవ సమాచారాలను అప్‌డేట్ చేస్తాం.
★ ఎన్నికల్లో హింసను అరికట్టేందుకు CRPF బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశాం. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాం.
★ ఈడీ, ఐటీ సహకారంతో అన్ని రాష్ట్రాల్లో నిఘా పెంచాం.
★ దేశవ్యాప్తంగా 2100 మంది పరిశీలకులను నియమించాం.
★ బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలపై ప్రత్యేక మానిటరింగ్ ఉంటుంది.
ఇతర వివరాలు:
★ ప్రస్తుత లోక్‌సభ పదవీ కాలం జూన్ 16వ తేదీతో ముగుస్తుంది.
★ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో ముగియనుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతో, ఒడిషా అసెంబ్లీ గడువు జూన్ 24వ తేదీతో ముగియనుంది.
★ గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను 2019 మార్చి 10న ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. మే 23న ఫలితాలు వెలువడ్డాయి.
★ దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం 10.50 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు..
ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికలు. ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్. మే 7న మూడో దశ పోలింగ్. మే 13న నాల్గొ దశ పోలింగ్. మే 13నే ఏపీ, తెలంగాణ పోలింగ్. మే 20న ఐదో దశ పోలింగ్. మే 25న ఆరో దశ పోలింగ్. జూన్ 1న ఏడో దశ పోలింగ్..