Union Minister Shivraj Singh Chouhan: రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. విజయవాడలో వరద ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని మంత్రి లోకేశ్ మంత్రికి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఏపీలో జరిగిన వరద ప్రవాహంపై ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తానని చెప్పారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయన్నారు. దీంతో ఐదురోజుల పాటు ప్రజలు ముంపులోనే ఉండిపోయారన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సీఎం ఎంతో కృషి చేశారన్నారు. సరైన సమయంలో స్పందించి సహాయక కార్యక్రమాలు చేపట్టారన్నారు. కేంద్రం నుంచి త్వరగా సాయం అందేలా చూస్తానని చెప్పారు.