Trending Now

విధ్వంసం నుంచి వికాసం వైవు..

గాడిన ప‌డుతున్న రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌

కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్టే నాటికి రూ.వేల కోట్ల లోటు

మైన‌స్ రూ.3,960 కోట్ల ఆర్థిక స్థితిని గ‌ట్టెంక్కించిన ఉప ముఖ్య‌మంత్రి

అడుగ‌డుగునా ఆర్థిక‌శాఖ‌లో స‌వాళ్లు
అన్నింటికినీ అధిగ‌మించేలా భ‌ట్టి విక్ర‌మార్క చ‌ర్య‌లు

జ‌నం మెచ్చేలా ప‌థ‌కాల అమ‌లు

రూపాయిరూపాయి పోగేసి ప్ర‌జ‌ల‌కందిస్తున్న వైనం

ఇందిర‌మ్మ రాజ్యం.. స‌క‌ల జ‌న సౌభాగ్యం

ఇదే మా నినాదం అంటున్న ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ప‌దేళ్ల కేసీఆర్ బీఆర్ఎస్ పాల‌న‌లో రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ విధ్వంసం అయింది. డిసెంబ‌ర్ 7న కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాష్ట్రంలో కొలువుదీరే నాటికి రాష్ట్ర ఖ‌జానా పూర్తిగా ఒట్టిపోయింది. ఇంకా చెప్పాలంటే దివాళా అంచున ఉంది. అంకెల్లో చెప్పాలంటే.. తెలంగాణ రాష్ట్ర బొక్క‌సంలో మైన‌స్ 3,960 కోట్ల రూపాయ‌ల లోటు ఉంది. ఈ అంకెలను రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే అధికారికంగా ధృవీక‌రించింది. ఇలాంటి స్థితిలో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌డంతో పాటు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల‌ను ప్ర‌జ‌ల‌కు అందించాల్సిన గురుత‌ర భాధ్య‌త‌ను ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌పైన‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఉంచింది.

అత్యంత క‌ఠిన స‌వాళ్ల‌ను ఎదుర్కొంటూ ఉప ముఖ్య‌మంత్రి రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను అతి త‌క్కువ స‌మ‌యంలోనే గాడిలోకి తెచ్చారు. వేల కోట్ల ఆర్థిక లోటును అధిగ‌మిస్తూ.. గ‌త ప్ర‌భుత్వం చేసిన అప్పులు, వ‌డ్డీల రూపంలో రూ.26,374 కోట్ల‌ను చెల్లించ‌డం ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై భ‌ట్టి విక్ర‌మార్క‌కు ఉన్న ప‌రిపూర్ణ అవ‌గాహ‌న‌కు నిద‌ర్శ‌నం అని చెప్పాలి.

ఒక వైపు అప్పులు, వ‌డ్డీలు చెల్లిస్తూనే సంక్షేమాన్ని కూడా ప‌రుగులు పెట్టిస్తున్నారు. రైతు భ‌రోసాకు రూ.5,575 కోట్లు, చేయూత పేరుతో ఇస్తున్న పింఛ‌న్ల‌కు రూ.3840 కోట్లు, ఇలా అన్నింటికి క‌లిపి ఈ నాలుగు నెలల్లోనే రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 66,507 కోట్ల‌ను వెచ్చించింది.

రూపాయిరూపాయి పోగేస్తూ.. ఒక ఇంటి పెద్ద కుటుంబాన్ని న‌డిపిన‌ట్లుగా, జ‌మాఖ‌ర్చుల ప‌ద్దుల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మనిస్తూ.. దుబారా ఎక్క‌డ జ‌రుగుతోందో తెలుసుకుంటూ.. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుతున్నారు. అవ‌స‌రాల‌క‌న్నా త‌క్కువ‌గా ఖ‌ర్చు చేస్తూ.. ఖ‌జానాను కాపాడుతున్నారు. రాష్ట్ర సంప‌ద ప్ర‌జ‌లకే చెందేలా చేయాల‌న్న కృత నిశ్చ‌యంతో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క అడుగులేస్తున్నారు.

భ‌ట్టి విక్ర‌మార్క పాటిస్తున్న పొదుపు మంత్రం, ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ వ‌ల్ల‌ రాబోయో రోజుల్లో మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని అటు ఆర్థిక నిపుణులు, ఇటు మేధావులు అంటున్నారు. ధ‌ర‌ల్లో భారీ వ్య‌త్యాసాలు లేకుండా ప్ర‌భుత్వాలు నిర్ణ‌యాలు తీసుకుంటే పెద్ద ఇబ్బందుఉ ఉండ‌వ‌ని సామాన్యులు చెబుతున్నారు. ధ‌ర‌లు పెంచ‌కుండా, సామాన్యుల‌పై ఆద‌న‌పు భారం మోప‌కుండా భ‌ట్టి విక్ర‌మార్క ఎలాంటి చ‌ర్య‌లు చేప‌డ‌తారో మ‌రికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

Spread the love

Related News

Latest News