Trending Now

ఓయో లాడ్జ్‌లో అక్రమంగా గ్యాంబ్లింగ్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఓయో లాడ్జ్‌లో అక్రమంగా గ్యాంబ్లింగ్ ఆడుతున్న ముగ్గురిని సైబరాబాద్ SOT టీమ్ అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు SOT మాదాపూర్ టీమ్ & గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా గచ్చిబౌలి లోని రాజ రాజేశ్వర కాలనీ ప్రాంతంలో సిల్వర్ కీ OYO లాడ్జ్ గదిపై దాడి చేయగా.. చట్టవిరుద్ధంగా ప్యాకాట ఆడుతున్న ముగ్గురిని పట్టుకున్నారు.

అనంతరం వారి వద్ద నుండి రూ.1,52,000/- నగదు, 7 సెట్లు ప్లేయింగ్ కార్డ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఎం. బస్వరాజ్ (ఆర్గనైజర్ పరారీలో ఉన్నారు), కొండాపూర్ కు చెందిన ఎం. శ్రీకాంత్, ఎన్. కిరణ్, గచ్చిబౌలికి చెందిన ఎన్. ప్రశాంత్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు..

అక్రమంగా నిలువ చేసిన PDS బియ్యాన్ని సైబరాబాద్ SOT పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు SOT బాలానగర్ టీం & సనత్‌ నగర్ పోలీస్ లు సంయుక్తంగా మొత్తినగర్ ప్రాంతం లో అవంతీ నగర్ లోని ఒక ఇంటి పై దాడి చేయగా.. అక్రమంగా నిల్వ చేసిన 400 కిలోల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, నిలవ చేసిన వ్యక్తి పట్టుకున్నారు. బోరబండకి చెందిన ఓం ప్రకాష్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సనత్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గచ్చిబౌలికి చెందిన సవదత్తి బసవ రాజప్ప ప్రమోద్ అరెస్ట్ చేయగా.. విచారణలో గంజాయిని దూల్‌పేట్ నుంచి సేకరించి చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి కూలీలకు విక్రయిస్తున్నాడు అని తెలిసింది.

అక్రమంగా నిలువ చేసిన PDS బియ్యాన్ని పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు..

అక్రమంగా నిలువ చేసిన PDS బియ్యాన్ని సైబరాబాద్ SOT పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు SOT బాలానగర్ టీం & సనత్‌ నగర్ పోలీస్ లు సంయుక్తంగా మొత్తినగర్ ప్రాంతం లో అవంతీ నగర్ లోని ఒక ఇంటి పై దాడి చేయగా.. అక్రమంగా నిలవచేసిన 400 కిలోల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, నిలవ చేసిన వ్యక్తి పట్టుకున్నారు. బోరబండకి చెందిన ఓం ప్రకాష్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సనత్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News