- ప్రవక్త మొహమ్మద్‌పై స్వామి అనుచిత వ్యాఖ్యలు
- చర్యలు తీసుకోవాలని ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్
ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి, నిర్మల్: ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్వామిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నిర్మల్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ సోమవారం నిర్మల్ జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ కమిటీ ప్రతినిధి బృందం సభ్యులు జిల్లా ఎస్పీ డాక్టర్.జి. జానకి షర్మిలను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రతినిధులు సభ్యులు మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని వ్యాపార వాణిజ్య సంస్థల యాజమాన్యాలు రేపు బంద్‌కు సహకరించాలని కోరారు. అలాగే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకునేలా డిమాండ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, కమిటీ ప్రతినిధి సభ్యులు అజీం బిన్ యాహియా, ముఫ్తీ అహెసాన్ షా ఖాస్మి, ముఫ్తీ అబ్దుల్ అలీం ఫైసల్ ఖాస్మీ, ముఫ్తీ రియాజ్ అన్సారీ ఖాస్మీ, మహమ్మద్ అజహర్ ఓద్దీన్ ఉన్నారు.