ప్రతిపక్షం, అంతర్జాతీయం: అమెరికాలో ‘జాంబీ డీర్ వ్యాధి’ కలకలం సృష్టిస్తోంది. అమెరికా వ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. ఇది మనుషులకు వ్యాపిస్తుందనే ఆందోళన మొదలైంది. ఇదొక నాడీ సంబంధిత అంటు వ్యాధి. ఇది సోకిన ప్రతి జంతువు చనిపోతుంది. అయితే ఈ వ్యాధి మనుషులకు సోకే ఛాన్స్ ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో తీవ్రతను తెలుసుకునేందుకు రోడ్డు ప్రమాదానికి గురైన జింకలు, దుప్పులు, ఎల్క్, కారిబౌలను పరీక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.