ప్రతిపక్షం, స్పోర్ట్స్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి తన సతీమణి, గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజాపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. రాజ్‌కోట్ టెస్ట్‌లో సంచలన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన జడేజా.. ఈ అవార్డును తన సతీమణి రివాబా జడేజాకు అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ.. జడేజా ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనతను అందుకోవడం ప్రత్యేకంగా ఉంది. అది కూడా ఒకే టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో శతకం.. మరో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనతను అందుకోవడం ఆల్‌రౌండర్‌గా నాకు గొప్ప అనుభూతినిచ్చింది. నా హోమ్ గ్రౌండ్లో నాకు దక్కిన స్పెషల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇది. ఈ అవార్డును నా సతీమణికి అంకితం ఇవ్వాలనుకుంటున్నా. నా సక్సెస్ వెనుక ఆమె కష్టం ఎంతో ఉంది. మానసికంగా ధృడంగా ఉండేలా ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.’అని జడేజా చెప్పుకొచ్చాడు.