ప్రతిపక్షం, ఏపీ: ఎన్నికల్లో పోటీపై ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ అలీ స్పందించారు. రాజమండ్రిలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో సోమవారం ఎంపీ మార్గాని భరత్‌తో కలిసి అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం జరుగలేదని అన్నారు. ఈ వారంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చే చాన్స్ ఉందని చెప్పారు. రాజకీయాల్లో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు అని అన్నారు. ఎన్నికల వేళ పొత్తులు పెట్టుకోవడం కూడా సహజం అని చెప్పారు. కానీ, అంతిమ విజయం ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడించారు.