లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా భాజపా విజయ సంకల్ప యాత్రలు
ప్రతిపక్షం, తెలంగాణ: తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న విజయ సంకల్ప యాత్రలు మంగళవారం ఉదయం నారాయణపేట జిల్లా కృష్ణాలో యాత్రను కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రాభించారు. శంఖారావం పూరించి యాత్రను షురూ చేశారు. రాష్ట్రంలో ఇవాళ మొత్తం నాలుగు క్లస్టర్లలో యాత్రలు ప్రారంభమయ్యాయి. మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలను ఐదు క్లస్టర్లుగా బీజేపీ విభజించిన విషయం తెలిసిందే. 114 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,500 కిలోమీటర్ల మేర విజయ సంకల్ప యాత్రలు జరుగనున్నాయి. ఈ యాత్రలో భాగంగా 106 సమావేశాలు, 102 రోడ్ షోలు నిర్వహించనున్నారు. మార్చి 2వ తేదీన ఈ యాత్రలు ముగియనున్నాయి. ముగింపు సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు.