ప్రతిపక్షం, స్పోర్ట్స్: ఐపీఎల్ లో గ్రెటెస్ట్ కెప్టెన్ ఎవరనే ప్రశ్నకు మాజీ క్రికెటర్లు ఆసక్తికర ఆన్సర్స్ ఇచ్చారు. చెన్నె కెప్టెన్ ధోనీ, ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్లను ప్రతిపాదించగా.. మిస్టర్ కూల్ వైపే మాజీ క్రికెటర్లు మొగ్గు చూపారు. స్టార్ జ్యూరీ డేల్ స్టెయిన్, టామ్ మూడీ, వసీం అక్రమ్, హేడెన్ ఏకగ్రీవంగా ధోనీనే గ్రేటెస్ట్ సారథిగా తేల్చారు. వీరిద్దరి నాయకత్వంలో ముంబై, చెన్నై చెరో 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.