ప్రతిపక్షం, తెలంగాణ: కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లాలోని సుభాష్ నగర్ లో 50 పూరిళ్లు దగ్ధమయ్యాయి. మంటల ధాటికి 5 గ్యాస్ సిలిండర్లు పేలాయి. దీంతో స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.