Trending Now

కుమారీ ఆంటీ డైలాగ్‌తో పోలీసుల సెన్సేషనల్ ట్వీట్..

ప్రతిపక్షం, తెలంగాణ: ప్రస్తుతం గచ్చిబౌలి కుమారీ ఆంటీ గురించి తెలియని సోషల్ మీడియా యూజర్ ఉండడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తక్కువ రోజుల్లో ఫుల్ పాపులర్ అయింది. ముఖ్యంగా ‘మీది మొత్తం 1000 అయింది. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’ డైలాగ్‌ కొంతకాలం ఇన్‌స్టాగ్రామ్‌ను కుదిపేసింది. ఇటీవల ఆమె పలు టీవీ షోల్లోనూ కనిపించి సందడి చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆమెతో పాటు ఆమె డైలాగ్ కూడా అంతే ఫేమస్ అయింది. ఆ డైలాగ్‌ను తాజాగా.. హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు కూడా క్రేజీగా వాడారు.

సిటీలోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక బైకర్ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు. నెంబర్ ప్లేట్‌ కనిపించకుండా చేశాడు. అతన్ని ఫొటో తీసిన ట్రాఫిక్ పోలీసన్న.. సోషల్ మీడియా(ఎక్స్‌)లో ఒక ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో ‘మీది మొత్తం 1000 అయింది. యూజర్ చార్జెస్ ఎక్స్‌ట్రా’ ట్వీట్ పెట్టారు. దీంతో షాకైన నెటిజన్స్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఇలా కూడా ఫైన్లు విధిస్తారా..? అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసుల ట్వీట్ వైరల్‌గా మారింది.

Spread the love

Related News

Latest News