ప్రతిపక్షం, ఏపీ: గుంటురు జిల్లా మంగళగిరి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరారు. ఆర్కేకు కండువా కప్పి పార్టీలోకి జగన్ ఆహ్వానించారు. తన సోదరుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఆర్కే వెళ్లారు. డిసెంబర్ లో ఆయన వైసీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన రాజీనామాపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న రాత్రి ఆర్కేతో వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి సుదీర్ఘంగా మంతనాలు జరిపగా.. ఆర్కే మళ్లీ వైసీపీలో చేరేందుకు ఒప్పించారు.