Trending Now

పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారు.. సోషల్ మీడియాలో వైరల్‌!

ప్రతిపక్షం, ఏపీ: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. సిద్ధం, సంసిద్ధం అంటూ.. అధికార వైసీపీ, ప్రతిపక్షాలు విస్తృతంగా సభలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనూ మేమూ సిద్ధమే అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు, పోటీ చేయాలనుకునే ఆశావహులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వైరల్‌గా మారింది. జనసేనాని పోటీ చేసే నియోజకవర్గం ఖరారు అయినట్లు సమాచారం. ఈ సారి కూడా పవన్ కల్యాణ్‌ పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధినేత ఉండటానికి అక్కడి పార్టీ నేతలు ఓ ఇంటిని సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పొత్తులు, సీట్ల పంపకాలపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

Spread the love

Related News

Latest News