ప్రతిపక్షం, కరీంనగర్ : కరీంనగర్లో ఎం సి హెచ్ నుండి మాయమైన శిశువు ఆచూకీ లభ్యమైంది. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ తక్కల్లపల్లి కి చెందిన బొమ్మ కవిత అనే మహిళ శిశువును అపహరించినట్టుగా గుర్తించారు పోలీసులు. నిన్న రాత్రి 10 గంటలకు బసంత్ నగర్లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సంతానం లేనందునే, జమ్మికుంట పట్టణానికి చెందిన ఓ డాక్టర్ సలహాతో ఆమె శిశువును అపహరించినట్టు తెలిసింది. పోలీసులు పసికందును ఆస్పత్రి సిబ్బంది సమక్షంలో పాపను తండ్రికి అప్పగించారు. దీంతో నిందితురాలుపై డాక్టర్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ నరేందర్ తెలిపారు. శిశువు ఆచూకీ కోసం ప్రయత్నించి సఫలమైన పోలీసులను అభినందించారు.