కోడి కత్తి కేసు ఏప్రిల్ 19కి వాయిదా..
ప్రతిపక్షం, ఏపీ: కోడికత్తి కేసు వాయిదా పడింది. కేసును విశాఖలోని ఇన్చార్జ్ ఎన్ఐఎ కోర్టు ఏప్రిల్ 19వ తేదికి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో వాంగ్మూలం ఇవ్వాల్సి వుండగా.. ఆయన హాజరు కావడం లేదు. ఇటీవలే విశాఖ సెంట్రల్ జైలు నుండి విడుదలైన నిందితుడు శ్రీను మంగళవారం కోర్టుకు హాజరయ్యారు.
కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఉదయం ఎన్ఐఏ కోర్టు జడ్జ్ సెలవులో ఉండడంతో ఎన్ఐఏ ఇంచార్జ్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి. ఈ కేసులో బెయిల్ తర్వాత తొలిసారిగా కోడికత్తి శ్రీను కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణను ఏప్రిల్ 19కి ఏన్ఐఏ ఇంచార్జ్ కోర్టు వాయిదా వేసింది.