Trending Now

మరో ఉద్యమం

(ప్రతిపక్షం స్టేట్ బ్యూరో)

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రభుత్వ నిర్ణయాలను ఎదిరించి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితులలోనూ కేంద్రం చేతికి చిక్కనివ్వబోమన్నారు. అవసరమైతే ఇందుకోసం మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి తీరుతామని తేల్చి చెప్పారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 5:
కృష్ణా నదీ జలాలకు సంబంధించి తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నది. ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతుల సాగునీటి హక్కులకు గొడ్డలి పెట్టులా మారిందని ఆ పార్టీ భావిస్తున్నది. కేఆర్ఎంబీకి నాగార్జునసాగర్, శ్రీశైలం సహా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించేలా, తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్న ప్రభుత్వ నిర్ణయాలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ అన్నిపరిణామాల మీద చర్చించేందుకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం సమావేశం జరిగింది. ఇందులో ఆ పార్టీ నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News