Trending Now

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలి..

ఆ తర్వాతనే ఎన్నికలు జరపాలి..

13 బీసీ సంఘాలు, 30 కుల సంఘాల డిమాండ్

హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని 13 బీసీ సంఘాలు, 30 కుల సంఘాలు డిమాండ్​ చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 20శాతం నుంచి 42 శాతం కు పెంచాలని 13 బీసీ సంఘాలు, 30 కుల సంఘాలు డిమాండ్ చేశాయి. నేడిక్కడ బీసీ భవన్​లో ఏర్పాటు చేసిన సమావేశానికి లాల్ కృష్ణ, గుజ్జ కృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిధిగా జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చే జూన్ నెలాఖరుకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని లీకులు ఇస్తున్నదన్నారు.

అయితే ప్రభుత్వం మరో పక్క కుల గణన చేయాలని నిర్ణయించిందని, కుల గణన చేయకుండా ఎన్నకలు నిర్వహించాలనుకుంటున్నదని, అయినా కూడా బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సమావేశంలో తీర్మాణించారు. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బహిరంగ సభలలో ప్రతిరోజు కులగణన జరుపుతామని, దాని ప్రకారము విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని బడ్జెట్ కేటాయిస్తామని – బిసి ఎజెండా ఎత్తుకొని బీసీల అభిమానం చూర గోంటుంటే ఇక్కడ బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్నదని ఆరోపించారు.

గతంలో 1986లో బీసీ సంక్షేమ సంఘం అనేక ఉధ్యమాలు చేయగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్​ స్పందించి బి.సి.లకు జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలలో 20శాతం రిజర్వేషన్లు పెట్టారన్నారు. సర్పంచ్ లకు పెట్టలేదు. బి.సి రిజర్వేషన్లు 50శాతంకు పెంచాలని, సర్పంచ్ ఎన్నికలలో కూడా బి.సి రిజర్వేషన్లు పెట్టాలని బి.సి సంక్షేమ సంఘం 6 సంవత్సరాలు వరుసగా సుదీర్ఘంగా ఉద్యమాలు చేయగా 1993లో అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి స్పందించి ఒక మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి బి.సి సంఘాలతో చర్చించి 20 శాతం నుంచి 34 శాతం పెంచుతూ రిజర్వేషన్లు పెట్టారు. అప్పటి నుంచి 2019 వరకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగాయి. సుప్రీంకోర్టు తర్వాత తీర్పు ప్రకారం 2019లో బీఆర్​ఎస్​ ప్రభుత్వం స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22శాతంకు తగ్గించారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే బీసీ రిజర్వేషన్లపై ప్రకటన చేయాలని వారు డిమాండ్​ చేశారు.

Spread the love

Related News

Latest News