ప్రతిపక్షం, వెబ్ డెస్క్: రష్యాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సైనికులు ప్రయాణిస్తున్న మిలటరీ కార్గో విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. వివరాల్లోకి వెళితే.. మాస్కోకు ఈశాన్యంగా ఉన్న ఇవానోవో ప్రాంతంలోని ఓ శ్మశానవాటిక సమీపంలో ఇల్యుషిన్ ఐఎల్-76 మిలటరీ కార్గో విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మంది సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు స్పాట్లోనే దుర్మరణం పాలయ్యారు. ఈ మేరకు రెస్క్యూ సిబ్బంది స్పాట్ వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.