ప్రతిపక్షం, స్టేట్ బ్యూరో, హైదరాబాద్ ఏప్రిల్8: ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ.. ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా శేరిలింగం పల్లి జోన్ లో ఈనెల 10న 2k రన్ నిర్వహించనున్నట్లు జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఏప్రిల్ 10న ఉదయం 6 గంటలకు 2k రన్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ నుండి ప్రారంభమై, హైటెక్స్ రోడ్ మెటల్ చార్మినార్ వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా 2k రన్ లో పాల్గొని ప్రజాస్వామ్య పరిణతి చాటాలని, వివిధ శాఖల అధికారులతో పాటు డ్వాక్రా సంఘాల సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు, యువతీ, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జోనల్ కమీషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో సీఈఓ వికాస్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జాయింట్ సీఈఓ సర్పరాజ్ అహ్మద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్, తదితరులు పాల్గొంటారని జోనల్ కమిషనర్ తెలిపారు.