ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ముంబైలోని వాంఖడే స్టేడియాన్ని నిర్మించి 50 ఏళ్లు పూర్తవడంపై సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. ‘10 ఏళ్లున్నప్పుడు మొదటిసారి వాంఖడే స్టేడియాన్ని చూశా. కానీ, ఐదేళ్ల తర్వాత అదే స్టేడియంలో ముంబై తరఫున అరంగేట్రం చేస్తానని అనుకోలేదు. 2011 ప్రపంచకప్‌ను నా దేశం కోసం గెలవడం నా కెరీర్‌లో బెస్ట్ మూమెంట్. ఇక్కడే నా 200వ టెస్ట్ మ్యాచ్‌నూ ఆడా. ఈ స్టేడియంలోనే నా ప్రియమైన ఆటకు వీడ్కోలు పలికా’ అని పేర్కొన్నారు.