ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: NSUI 54 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్ లో NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి. NSUI జెండా ను గాంధీభవన్ లో ఎగరేసి కేక్ కట్ చేసి.. సంబరాలు జరుపుకున్నారు. అలాగే NSUIఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్కింగ్ ప్రెసిడెంట్ లు మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, సనత్ నగర్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కోట నీలిమ, NSUIరాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సిటీ ప్రెసిడెంట్ లు ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా NSUI అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. తెలంగాణ లో ఉన్న విద్యార్థి, విద్యార్థినులకు, యువకులకు NSUI అవిర్భవదినిత్సవా శుభాకాంక్షలు తెలియజేశారు. 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల పక్షాన NSUI నిష్పక్షపాతంగా పోరాటం చేసింది. రాష్ట్రంలో ఎక్కడ విద్యార్థులకు సమస్యలు వచ్చిన, యూనివేర్సిటీస్ లో ఎలాంటి సమస్య వచ్చినా, ఇంటర్మీడియట్, స్కూల్స్ లో వచ్చిన ప్రతి సమస్య పై పోరాటం చేసిందన్నారు.