Trending Now

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ ఎన్నికలు.. రెండో విడతలో 57.03 శాతం పోలింగ్

Jammu and Kashmir Assembly Elections 2024: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. రెండో విడత ఎన్నికల్లో అర్ధరాత్రి 11.45 వరకు 57.03 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. శ్రీనగర్, బుద్గాం, రాజౌరి, పూంచ్, గందర్బల్, రియాసి జిల్లాలలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలు పోలింగ్ జరిగిందని జమ్మూకశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పి.కె. పోల్ తెలిపారు. అంతకుముందు మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇదిలా ఉండగా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఈనెల 18 వ తేదీన మొదటి విడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మొదటి విడతలో 24 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్‌లో 61.38 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక, మూడో విడత పోలింగ్ అక్టోబర్ 1వ తేదీన మిగిలిన 40 స్థానాలకు జరగనుంది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు ఉండనుంది.

Spread the love

Related News

Latest News