Trending Now

ఓటర్ అవగాహనపై 5K రన్..

ప్రతిపక్షం, సిద్దిపేట: లోక్ సభ ఎన్నికలు 2024 ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏఆర్ఓ, ఆర్డీవో సదానందం, స్వీప్ నోడల్ అధికారి డీఆర్డీఓ జగదేవ్ ల ఆధ్వర్యంలో 5 కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మన చౌదరి హాజరయ్యారు. అనంతరం ఆమె జెండా ఊపి 5 కే రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది చాలా కీలకమైనది. లోక్ సభ ఎన్నికలలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Spread the love

Related News

Latest News