Trending Now

రాష్ట్రంలో 65 స్కిల్​ సెంటర్లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: నిరుద్యోగులకు విద్యతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. పలు పరిశ్రమలు, సంస్థల్లో వారికి అవసరమయ్యే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడంతో పాటు అన్నింటిలో వారికి నైపుణ్యం పెంపొందించేందుకు సీఎం రేవంత్​రెడ్డి నిర్ణయించారు. గత ఎన్నికల సమయంలో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం సైతం ఈ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే!. ఇందులో భాగంగా శనివారం సచివాలయంలో టాటా టెక్నాలజీస్​ లిమిటెడ్​(టీటీఎల్​) ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలలో ఆధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలు స్కిల్​ సెంటర్లు ఏర్పాటుపై టీటీఎల్​తో ఒప్పందం కుదిరింది.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయనున్న టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (TTL).ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్రాజెక్టును చేపడుతున్న టాటా టెక్నాలజీస్ 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గించే బ్రిడ్జి కోర్సులను ప్రారంభిస్తోంది . 2024‌‌.-25 విద్యాసంవత్సరం నుంచే ప్రాజెక్టు లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.

Spread the love

Related News

Latest News