నిర్మల్‌లో భక్తిప్రపత్తుల మధ్య 67వ బ్రహ్మోత్సవాలు..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 20: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 67వ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని అత్యంత శోభాయమానంగా వైభవపేతంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో నిర్ణీత అర్చకుల కాల పట్టిక ప్రకారం ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. స్వామి వారి ఉత్సహ విగ్రహాలను పల్లకిలో ఆలయం చుట్టూ ప్రదక్షణ చేయించారు. శుక్రవారం నుంచి ఈనెల 24 వరకు రోజువారి పూజా కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు ఆలయంలో నిర్వహించుకోవడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీధర్ పేర్కొన్నారు.
ఈ ఐదు రోజులపాటు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రభుత్వాలను పురస్కరించుకొని ఆలయంలో ఆలయ పరిసరాలలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించడంతోపాటు భక్తులకు ఎలాంటి ఆ సౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వాలంటీర్ల ఏర్పాటు ఇతర సౌకర్యాల కల్పన చేయడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ డైరెక్టర్ రాజేశ్వర్, రవి, అయ్యన్న గారి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.