8 coaches of Agartala-Lokmanya Tilak Express derail in Assam: అసోంలో రైలు ప్రమాదం జరిగింది. అగర్తల నుంచి ముంబై మధ్య నడిచే లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్(12520) పట్టాలు తప్పింది. గురువారం సాయంత్రం 4 గంటలకు దిమా హసావో జిల్లాలోని దిబలోంగ్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంజిన్, పవర్ కార్‌తో పాటు ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని కలగలేదని రైల్వే అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంతో లుమ్ డింగ్- బాదర్ పూర్ సింగిల్ – లైన్ హిల్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్లు తెలిపారు. మరోవైపు సహాయ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.