CM Revanth Reddy Says Special Drive On New Ration Cards: రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు రెండో విడత ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనుంది. మంగళవారం వైద్యారోగ్యశాఖ ప్రాజెక్టులపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇందులో రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్‌తో రాష్ట్రంలో ప్రజలందరికీ హెల్త్ కార్డులు అందజేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిల అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
అలాగే, గోషామహల్లో కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రిపై సీఎం సమీక్ష నిర్వహించారు. రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ మేరకు ఆర్కిటెక్ట్ లను సంప్రదించి ఆస్పత్రి నిర్మాణానికి డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. అదే విధంగా భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రణాళిక చేయాలని చెప్పారు. గోషామహల్ సిటీ పోలీస్ అకాడమీకి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాని సీఎం ఆదేశాలు జారీ చేశారు.