MLC Kavitha Release From Jail: తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఆమెకు ఇవాళ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదున్నర నెలల తర్వాత కవితకు ఉపశమనం లభించింది. ఈ మేరకు పూచీకత్తు బాండ్లను ఆమె భర్త అనిల్, బీఆర్ఎస్ ఎంనీ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించారు. దీంతో రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు.
తీహార్ జైలు నుంచి విడుదలైన ఆమెకు బీఆర్ఎస్ నాయకులు జైలు వద్ద బాణాసంచా పేల్చి వెల్ కమ్ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. నేను కేసీఆర్ బిడ్డను, మొండి, మంచిదాన్ని అన్నారు. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. ఆ సమయం అతి త్వరలో రానుందన్నారు. 18ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని చెప్పారు. నేను కేసీఆర్ కూతురిని, తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు.