Hyderabad City Police Website Back After Three Months: హైదరాబాద్ సిటీ పోలీస్ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. దాదాపు హ్యాకింగ్‌కు గురైన 80 రోజుల తర్వాత ఎట్టకేలకు వెబ్సైట్ తిరిగి ప్రారంభమైంది. జూన్ 7న రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల వెబ్సైట్లను యూపీలోని గ్రేటర్ నోయిడాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థి జతిన్ కుమార్ హ్యాకింగ్ చేశాడు. ఈ కేసులో జతిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల వెబ్ సైట్లు తిరగి అందుబాటులోక వచ్చాయి.
తెలంగాణ పోలీస్ వ్యవస్థలో కీలకమైన హాక్ ఐ, టీఎస్ కాప్, ఎస్ఎంఎస్ వ్యవస్థల్లోకి అక్రమంగా చొరబడి కొంత డేటాను దొంగిలించిన సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో టీఎస్ కాప్ యాప్ హ్యాక్ కావడంపై విమర్శలు వచ్చాయి. కొంతమంది సులువుగా ఉండే పాస్వర్డ్ లు పెట్టుకోవడంతోనే హ్యాకింగ్ సులువైనట్లు ప్రచారం జరిగింది.