Nagarjuna in Coolie Firstlook Poster: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా, నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ నాగార్జున ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సైమన్ అనే పాత్రలో నాగ్ నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సైమన్ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాపై నాగార్జున స్పందించారు. ‘ఖైదీ’ సమయం నుంచి నీతో కలిసి పనిచేాయాలనుకున్నా. ‘కూలీ’లో భాగమవడం ఆనందంగా ఉంది.’ అని నాగార్జున ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, నాగార్జున తెలుగులో ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.