Bangladesh help from the World Bank: బంగ్లాదేశ్ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంది. ఇటీవల రిజర్వేషన్ల అంశంపై జరిగిన అల్లర్లతో ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. దేశంలో ఆహార ఉత్పత్తుల ధరలు 14 శాతానికి పైగా పెరిగాయి. గత 13 ఏళ్లలో ఇదే అత్యధికం. దీంతో ఆర్థిక సహాయం కావాలని ప్రపంచ బ్యాంకును కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగానే ఆర్థికవేేత్త, నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఆర్థిక సాయం అడిగింది. ఈ మేరకు 8 బిలియన్ డాలర్లను సమకూర్చాలని కోరింది.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం బంగ్లాదేశ్ దేవానికి 100 బిలియన్ డాలర్లకుపైగా విదేశీ అప్పు ఉంది. ఈ రుణాలు చెల్లించేందుకు ఐఎంఎఎఫ్ నుంచి 300 బిలియన్ డాలర్లు, పునరావస కార్యక్రమాలకు మరో 300 డాల్ర్లు కావాల్సి ఉంది. కాగా, గతేడాది షేక్ హసీనా ప్రభుత్వం రుణ కార్యక్రమం కింద ఐఎంఎఫ్ నుంచి 4.7 బిలియన్ డాలర్లకు గానూ 2.3 బిలియన్ డాలర్లను పొందింది.