Samantha Demands Telangana Govt to Publish Hema Committee: కేరళలోని సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం జస్టిస్ హేమ కమిటీతో వెలుగుచూసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇటీవల దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కీలక వ్యాఖ్యలు చేసింది. హేమ కమిటీని స్వాగతిస్తున్నామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.
కేరళలో డబ్ల్యూసీసీ(ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్) చేస్తున్న కృషిపై సమంత ప్రశంసలు కురిపించింది. మాలీవుడ్ మహిళల హక్కుల కోసం ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ పోరాడుతుంది. అయితే తెలుగు పరిశ్రమలోనూ అలాంటి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సమంత విజ్ఞప్తి చేసింది.