Jr NTR Emotional Trip with His Mother: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. దీంతోపాటు ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి తన తల్లి స్వగ్రామం కుందాపురంలోని ఉడిపి శ్రీకృష్ణమఠాన్ని సందర్శించారు.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తోపాటు తన తల్లిని తీసుకొని ఉడిపికి వెళ్లాడు. అక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తల్లితో కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘ మా అమ్మ ఎప్పుడూ తన సొంతూరు కుందాపురాతో పాటు ఉడిపి శ్రీ కృష్ణుడి దర్శనం చేయించాలని కలలు కంటుంటుంది. ఇప్పుడు మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది. సెప్టెంబర్ 2న ఆమె పుట్టిన రోజు కావడంతో నేనున ముందుగానే ఆమెకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇదే. విజయ్ కిరంగాదూర్ గారికి ధన్యవాదాలు. రిషబ్ షెట్టి కూడా ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు.